సుశాంత్ ఆత్మహత్య కేసు అటు తిరిగి ఇటు తిరిగి...డ్రగ్స్ కేసుగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఒకరిపై మరొకరు సెటైర్స్  వేసుకుంటూ యుద్దం చేస్తూ మీడియాకు మేటర్ అందిస్తున్నారు.  ఆ క్రమంలో సినీ నటిగా పాప్యులర్ అయి, ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్న ఊర్మిళా మంతోండ్కర్ తో వివాదానికి దిగిన కంగన, తన పేరును దానిలోకి లాగడంపై సన్నీ లియోన్ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో  ఇండైరక్ట్ గా  అంటే పేరు ఎత్తకుండా అర్దమయ్యేలా,  అనీ అనకుండానే అనేసినట్టుగా ఓ పోస్ట్ ను పెట్టింది.

మొదట ఊర్మిళను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ గా అభివర్ణించిన కంగన, ఆపై, తానేమీ తప్పుగా విమర్శించలేదని, భారత సినీ పరిశ్రమ సన్నీ లియాన్ వంటి అడల్ట్ స్టార్ ను కూడా స్వాగతించిందని వ్యాఖ్యానించింది. ఇక, ఈ కామెంట్లను గమనించిన సన్నీ లియాన్, తన ఇన్ స్టాగ్రామ్ లో "నీ గురించి ఎంతో తక్కువ తెలిసిన వాళ్లు, ఎంతో ఎక్కువ మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది" అని కామెంట్ చేసింది. ఇక, ఈ పోస్ట్ వైరల్ కాగా, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సన్నీ సరిగ్గా మాట్లాడిందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఊర్మిళా మతోంద్కర్‌ (రంగీలా ఫేమ్)ను `స్టాఫ్ట్ పోర్న్‌స్టార్`గా అభివర్ణిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన కామెంట్ బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు విషయంలో నటి కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, ఆమె సరిగ్గానే మాట్లాడిందంటూ, ఎంతో మంది మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఇన్నాళ్లూ ఆమెకు మద్దతుగా నిలిచిన వారికీ కోపం తెప్పించాయి. సీనియర్ నటి ఊర్మిళా మతోంద్కర్ ను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ కంగన వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

అంతకుముందు ఊర్మిళ మాట్లాడుతూ, ఇండియా మొత్తం డ్రగ్స్ సమస్య ఉందని, కంగన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్ర బిందువన్న సంగతి ఆమెకు తెలుసా? ముందు సొంత రాష్ట్రం గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన కంగన, ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, నేనంటున్న మాట కఠినమే అయినా, ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్. ఇదే నిజం. తాను గొప్పనటినని ఎన్నడూ నిరూపించుకోలేదు. ఆమె చేసిందేముంది? ఆమె పాలిటిక్స్ లోకి రాగాలేనిది, నేను వస్తే తప్పేంటని ప్రశ్నించింది.

కంగన వ్యాఖ్యలు వైరల్ కాగా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను తప్పుబట్టారు. స్వరా భాస్కర్, అనుభవ్ సిన్హా వంటి వారు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. కంగన వ్యాఖ్యలు తోటి నటిని అగౌరవపరిచేవేనని అన్నారు.
 
జయా బచ్ఛన్ పై కంగనా ట్వీట్ల వర్షం కురిపిస్తూ విరుచుకపడితే..తాజాగా ‘రంగీలా’ నటి ఊర్మిళా మటోండ్కర్ సీన్ లో ప్రవేశించింది. కంగనాను టార్గెట్ చేస్తూ.. నువ్వేదో బాధితురాలిగా ‘వుమన్ కార్డ్ ‘ప్లే చేస్తున్నావని, దమ్ముంటే నీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచే డ్రగ్స్ మీద ‘వార్’ మొదలు పెట్టాలని ఛాలెంజ్ చేసింది. ముంబై తన నగరమని, ఆ సిటీని ఎవరు, ఎలా తప్పు పట్టినా తాను సహించబోనని ఊర్మిళ హెచ్ఛరించింది.