శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది. 

గత ఏడాది సన్నీలియోన్ గూగుల్ సెర్చ్ లో సినీ రాజకీయ ప్రముఖులందరిని అధికమించి ఇండియాలో అగ్రస్థానంలో నిలిచింది. 2019లో కూడా సన్నీలియోన్ హవా కొనసాగుతోందట. తాజా గూగుల్ ట్రెండ్స్ ప్రకారం సన్నీలియోన్.. ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని అధికమించి అగ్ర స్థానంలో కొనసాగుతోంది. 

సన్నీలియోన్ కి సంబంధించిన వార్తలు, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోలు, బయోపిక్ చిత్రం కరణ్ జీత్ కౌర్  కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట. దీనిపై సన్నీలియోన్ స్పందించింది. తనని అభిమానిస్తున్న వారివల్లే ఇదంతా అని సన్నీలియోన్ తెలిపింది. ఈ ఘనత సాధించినందుకు తాను గొప్పగా ఫీల్ అవుతున్నానని సన్నీలియోన్ తెలిపింది.