సన్నిలియోన్ గురించి ఈ రోజు తెలియంది ఎవరికి..అడల్ట్ స్టార్ గా ఆమెకు ఉన్న క్రేజ్ ని బాలీవుడ్ క్యాష్ చేసుకుంటే, టాలీవుడ్ సైతం దాన్ని వాడుకుంది. రీసెంట్ గా రాజశేఖర్ నటించిన గరుడువేగ సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేసి అదరకొట్టింది. ఇప్పుడు మరోసారి ఆమె సౌతిండియా తెరపై మెరవనుంది. రాశిఖన్నా, సిద్దార్ద కాంబినేషన్ లో రూపొందుతున్న  సైతాన్ కి బచ్చా అనే తమిళ సినిమాలో ఆమెను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆమె తెరపై ఉండేది కొద్ది సేపే కాని, గుర్తుండిపోయే పాత్ర అని చెప్తున్నారు. సిద్దార్ద సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో కప్పల్ అనే కామెడీ సినిమా డైరక్ట్ చేసి హిట్ కొట్టిన కార్తీక్  జి క్రిష్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులోకి సైతం డబ్బింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సన్ని లియోన్, రాశి ఖన్నా ఈ సినిమా తెలుగు మార్కెట్ కు యుఎస్ పి గా చెప్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ అని సమాచారం. హీరో పాత్ర చాలా క్వికీగా,క్రేజీగా సాగుతుందని అంటున్నారు. 

వరుణ్‌ తేజతో ‘తొలిప్రేమ’, రవితేజతో ‘టచ్ చేసి చూడు’,అవసరాల శ్రీనివాస్ తో ‘ఊహలు గుసగుసలాడే’,గోపీచంద్ తో జిల్, ఎన్టీఆర్ సరసన జై లవకుశ, మరోసారి రవితేజతో  రాజా ది గ్రేట్, వంటి  చిత్రాలుచేసిన హాట్ బ్యూటీ రాశీ ఖన్నా తెలుగులో ఈ మధ్యన తగ్గించింది. రెమ్యునేషన్ పెంచటంతో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. దాంతో రాశీ ఖన్నా తమిళ తంబీలను ఆకట్టుకునే పనిలో భాగంగా తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. 

ఇక కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగుమ్మగా ఉండే రాశీ ఖన్నా.. ఈ మధ్య నాజూకుగా మారి అలరిస్తోంది.  అప్పడప్పుడు సోషల్ మీడియాలో తన లేలేత అందాలను పరుస్తూ చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో  హీట్ పెంచుతోంది.