బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల ఓ షోలో కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ మీడియా ద్వారా వెల్లడించాడు. అర్భాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'పించ్' అనే కార్యక్రమానికి సన్నీ ఇటీవల హాజరయ్యారు. 

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై నెటిజన్లు చేసే కామెంట్లు.. వారు అడిగే ప్రశ్నల గురించి చర్చించడమే ఈ షో ప్రత్యేకత. ఈ క్రమంలో అర్భాజ్.. సన్నీలియోన్ ని తన కెరీర్ కి సంబంధించి చాలా ప్రశ్నలు అడిగారు.

అన్నింటికీ సమాధానాలు చెప్పుకొచ్చిన సన్నీ ఓ ప్రశ్న దగ్గర ఆగిపోయింది. ఓ నెటిజన్ సన్నీపై చేసిన అసభ్యకరమైన కామెంట్ ను చదివి వినిపించడంతో ఆమె వెంటనే ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి అర్భాజ్ చాలానే ప్రయత్నించారట. 

సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టక ముందు శృంగార తారగా నటించింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ మర్చిపోయి సినిమాలు చేసుకుంటుంటే ఇప్పుడు కూడా పాత విషయాలు గుర్తు చేసి బాధ పెడుతున్నారంటూ ఆమె బోరుమంది.