ఓ కండోమ్ కంపెనీ ప్రకటనలో సన్నీ లియోనీ ఫోటో సన్నీని పెట్టి నవరాత్రి కాన్సెప్ట్ తో కండోమ్ యాడ్ సన్నీతో పెట్టిన యాడ్ పై హిందుత్వ వాదుల ఆగ్రహం
బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ ఫోటోతో ఓ కండోమ్ తయారీ కంపెనీ ఏర్పాటు చేసిన కండోమ్ యాడ్ హోర్డింగ్ వివాదాస్పదం అయింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవరాత్రి థీమ్ తో గుజరాత్‌లో సన్నీ ఫోటోపెట్టి ఏర్పాటు చేసిన ఓ కండోమ్ యాడ్ మీద కొన్ని హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.
'ప్లే బట్ విత్ లవ్, దిస్ నవరాత్రి' అంటూ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ మీద హిందూ యువ వాహిని నిరసనకు దిగింది. ఇది కచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని ఈ గ్రూప్ నేత నరేంద్ర చౌదరి అన్నారు. ఈ హోర్డింగులను వెంటనే తొలగించకపోతే తమ నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఈ యాడ్ హోర్డింగుల మీద 'ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు. వెంటనే కలుగజేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలోనూ సన్నీ నటించిన ఈ కండోమ్ యాడ్ గోవాలోనూ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ యాడ్ పోస్టర్లు గోవా బస్సుల్లో ప్రదర్శించడం మహిళ సంఘాలు నిరసన వ్యక్తం చేయగా, అక్కడి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ఈ యాడ్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
