న్యూ ఇయర్ వేడుకలకు సన్నీ లియోనీ దూరం.. అంత పట్టింపా?

న్యూ ఇయర్ వేడుకలకు సన్నీ లియోనీ దూరం.. అంత పట్టింపా?

గత కొంత కాలంగా బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనికి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరులో నిర్వహించతలపెట్టిన ‘సన్నీ నైట్స్’ పై వివాదానికి తెరపడింది. తాను ఈ కార్యక్రమానికి తను హాజరు కానని సన్నీ లియోనీ స్పష్టం చేసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం సన్నీలియోన్ ని బెంగళూరు తీసుకు వచ్చి ‘సన్నీ నైట్స్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఓ సంస్థ ఏర్పాట్లు చేసుకోగా.. ఈ కార్యక్రమంపై ఆందోళనకారులు పెద్దయెత్తున నిరసన తెలిపారు.

 

సన్నీ నైట్స్ ను నిర్వహించడానికి వీల్లేదని కన్నడ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. తమను కాదని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆత్మహుతికి పాల్పడతామని కర్ణాటక పరిరక్షణ సమితి సభ్యులు హెచ్చరించారు. సన్నీలియోనీ మాజీ పోర్న్ స్టార్ కాబట్టి.. ఆమె ఈ కార్యక్రమాలకు హాజరు కాకూడదనేది కన్నడ సంఘాల అభ్యంతరం. మరోవైపు సన్నీలియోన్ బెంగళూరుకు వస్తే భద్రత కల్పించలేమని పోలీసు శాఖ కూడా స్పష్టం చేసింది.
 

కొంతకాలం కిందట ఆమె కేరళ వెళ్లినప్పుడు జనం కిక్కిరిసిపోయారని, బెంగళూరులో క్రౌడ్ ఆ స్థాయిలో వచ్చే అవకాశాలున్నందున తాము కంట్రోల్ చేయలేమని, నగరం స్తంభించిపోతుందని బెంగళూరు పోలీసులు సన్నీ నైట్స్ కు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాలని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు.

 

సన్నీ నైట్స్ పై పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి వుండగా.. ఇంతలోనే తాను బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలకు రావడం లేదని స్పష్టం చేసింది. సన్నీ నైట్స్ కు తను రాను అని చెప్పింది. తనకు ఆ కార్యక్రమానికి హాజరు కావడం కన్నా, ప్రజల భద్రతే ముఖ్యం అని సన్నీ చెప్పింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page