నటి సన్నీలియోన్ తన అసిస్టెంట్ ప్రభాకర్ ను తలచుకొని కంటతడి పెట్టుకున్నారు. ప్రభాకర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. 2018 లో అతడి కోసం సన్నీ ఇరవై లక్షలు సహాయం చేసి.. నెటిజన్లను కూడా ఆదుకోవాలని కోరారు.

అప్పట్లో ఈ విషయంపై నెటిజన్లు సన్నీని ట్రోల్ చేశారు. సన్నీ పాదరక్షకాల విలువే ఇరవై లక్షలు ఉంటుందని అలాంటిది ఆమె విరాళం అడుగుతున్నారని కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ విషయంపై అర్భాజ్ ఖాన్ షోలో సన్నీ మాట్లాడారు. నెటిజన్ల కామెంట్లు, ప్రభాకర్ ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రభాకర్ తన ఇంట్లో వ్యక్తిలాంటి వారని.. అతడి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు మొత్తం తను, తన భర్త డేనియల్ భారించామని కానీ ఆయన్ని కాపడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.

అతడు చాలా ఏళ్లు ఇండస్ట్రీలో పని చేశారని.. అతడిని ఇష్టపడే వారు చాలా మందే ఉంటారని.. తను నెటిజన్ల సహాయం కోరింది వైద్యం కోసం కాదని.. ప్రభాకర్ కుటుంబ సభ్యుల అవసరాల కోసం అలా అడిగానని చెప్పుకొచ్చింది. అతడిని చాలా మిస్ అవుతున్నానని.. ప్రజలు ఏం అనుకుంటున్నారనేది తనకు అనవసరమని వెల్లడించింది.