సునీల్ కు త్రివిక్రమ్ ఇస్తున్న సూపర్ గిప్ట్ అదే
కాస్తంత తేరుకుని మళ్లీ కమెడియన్ గా కొనసాగాలని నిర్ణయించుకుని, ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అంతే కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ సినిమాలు చేస్తున్నాడు. అయితే అనుబంధంతోనే సునీల్ కి 'అరవింద సమేత' .. ' అల వైకుంఠపురములో' సినిమాల్లో త్రివిక్రమ్ అవకాశాలను ఇచ్చాడు. అయితే ఆ రెండు పాత్రలు కూడా సునీల్ స్థాయికి తగినవి కావనే విమర్శలు వచ్చాయి. అందువలన ఈ సారి త్రివిక్రమ్ సునీల్ పాత్ర విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ పాత్రను ఒక రేంజ్ లో జనంలోకి తీసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు.
సినిమాల్లోకి రావడానికి ముందునుంచే త్రివిక్రమ్ - సునీల్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో అద్దెకి ఉంటూ సినిమా ఆఫర్స్ కోసం తిరిగారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇద్దరి మధ్య ఆ ప్రెండ్షిప్ కొనసాగుతూనే వుంది. సునీల్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ ను అందుకోవడం వెనుక త్రివిక్రమ్ హస్తం వుందని వేరే చెప్పక్కర్లేదు. స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకుని ఆయన రాసిన కొన్ని పాత్రలు సునీల్ ను నిలబెట్టేశాయి. ఆ తరువాత హీరో వేషాల వైపు వెళ్లిన సునీల్ దెబ్బతిన్నాడు.
అయితే కాస్తంత తేరుకుని మళ్లీ కమెడియన్ గా కొనసాగాలని నిర్ణయించుకుని, ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అంతే కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ సినిమాలు చేస్తున్నాడు. అయితే అనుబంధంతోనే సునీల్ కి 'అరవింద సమేత' .. ' అల వైకుంఠపురములో' సినిమాల్లో త్రివిక్రమ్ అవకాశాలను ఇచ్చాడు. అయితే ఆ రెండు పాత్రలు కూడా సునీల్ స్థాయికి తగినవి కావనే విమర్శలు వచ్చాయి. అందువలన ఈ సారి త్రివిక్రమ్ సునీల్ పాత్ర విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ పాత్రను ఒక రేంజ్ లో జనంలోకి తీసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాలోనే సునీల్ కి త్రివిక్రమ్ మంచి పాత్ర ఇస్తున్నాడని, ఆ పాత్రతో సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. రి.
మరో ప్రక్క అల్లు అర్జున్ హీరోగా సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాలోనూ విలన్ గా సునీల్ కనిపించనున్నారు. ఆ సినిమాలో కీలక పాత్ర కోసం కొంచెం చిన్న స్థాయి క్యారెక్టర్ నటుడిని అనుకోగా.. అతణ్ని తప్పించి ఇప్పుడు ఆ స్థానంలోకి సునీల్‌ను తీసుకున్నారు. సునీల్‌ను ఈ సినిమాకు తీసుకోవాలని బన్నీకి త్రివిక్రమ్ చెప్పగా.. అతను సుక్కుకు రెకమండ్ చేసి తనకు సినిమాలో పాత్రను ఇప్పించినట్లు చెప్పుకున్నారు.