ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్ లో వచ్చిన చిత్రాల్లో RX100ఒకటి. అదే విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న చిత్రాల్లో  ఒకటిగా నిలిచినా సంగతి తెలిసిందే. వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా అందించిన విజయంతో ఒక్కసారిగా హీరో కార్తికేయ క్రేజ్ పెరిగింది. అతను వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఈ కథపై బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో తనయుడు కూడా నమ్మకం పెట్టుకున్నాడు. సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టిని ఆర్ఎక్స్ రీమేక్ లో నటిస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నదియా వాలా ఈ సినిమా హిందీ హక్కులను 1.5కోట్లకు కొన్నాడు. 

అయితే సినిమా కథకు కొత్త హీరో అయితే బావుంటుందని సాజిద్ గత కొన్ని రోజులుగా సినీ హీరోల వారసులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఫైనల్ గా ఇటీవల అహన్ శెట్టిని ఆర్ఎక్స్100 హిందీ రీమేక్ లో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మరి ఈ యువహీరో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.