భీమవరం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ కమెడియన్ గా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక దశలో సునీల్ టాలీవుడ్ టాప్ కమెడియన్స్ బ్రహ్మానందం, వారికే గట్టి పోటీ ఇచ్చాడు
భీమవరం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ కమెడియన్ గా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక దశలో సునీల్ టాలీవుడ్ టాప్ కమెడియన్స్ బ్రహ్మానందం, వారికే గట్టి పోటీ ఇచ్చాడు తర్వాత హీరోగా అవకాశాలు వచ్చాయి రోజులు కెరీర్ బాగానే సాగింది పరాజయాలు కావడంతో సునీల్ ఇప్పుడీ మళ్ళి కామెడీ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.
త్వరలో సునీల్ ఎఫ్ 3 చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో మెప్పించబోతున్నాడు. మే 27న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. తాజాగా ఇంటర్వ్యూలో సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులకు కామెడీ చిత్రాలే చాలా కీలకం అని తెలిపాడు.
కామెడీ సినిమాలు తగ్గితే తనకు జరిగే నష్టం కంటే ప్రేక్షకులకే ఎక్కువ నష్టం అని సునీల్ తెలిపాడు. హాయిగా నవ్వుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయని డాక్టర్లే చెబుతున్నారు. సరదాగా నవ్వుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి కామెడీ చిత్రాలు ఎక్కువగా రావాలి.
మనిషి బాగా కష్టపడిన తర్వాత సరదాగా నవ్వుకుంటే ఎంతో ఆరోగ్యం. అలా నవ్వుకోవాలంటే కామెడీ చిత్రాలే కీలకం అని సునీల్ తెలిపాడు. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
