టాలీవుడ్ లో కమెడియన్స్ జోరు ఒకప్పుడు మాములుగా ఉండేది కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త తరహా హాస్య నటులు పుట్టుకొస్తున్నారు. గతంలో తీరిక లేకుండా నటనలో బిజీ అయిన సునీల్ చాలా రోజుల తరువాత మళ్ళీ బిజీ షెడ్యూల్ తో కనిపిస్తున్నాడు. 

హీరోగా ఒక ప్రయత్నం చేసి ప్రస్తుతం మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కిన సునీల్ మంచి ప్రాజెక్టులనే పడుతున్నాడు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రవితేజ డిస్కోరాజా సినిమాలో కూడా సునీల్ నటిస్తున్నాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాలో కూడా సునీల్ కీలక కమెడియన్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు. 

వీటితో పాటు మరో రెండు బడా ప్రాజెక్టులను సునీల్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా సునీల్ చాలా వరకు తగ్గినట్లు సమాచారం. సాధారణంగా హీరోగా ఉన్నప్పుడు కోటికిపైగా పారితోషికం అందుకునే సునీల్ ఇప్పుడు కమెడియన్ రోజుకి 3.5 నుంచి 4 లక్షల వరకు అందుకుంటున్నట్లు టాక్.