'మైఖేల్' ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ దక్కించుకుంది.

సందీప్‌కిషన్ మైఖేల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ దక్కించుకుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారచం మేరకు ...ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్, నాయకుడుతో పాటు గ్యాంగ్‌స్టర్ కథాంశాలతో రూపొందిన పలు సినిమాల స్ఫూర్తితో మైఖేల్‌ను తెరకెక్కించారు.
చిత్రం కథేమిటంటే... మైఖేల్ (సందీప్ కిషన్) అనే కుర్రాడు చిన్నప్పుడే గురు అలియాస్ గురునాథ్ (గౌతమ్ మీనన్) అనే గ్యాంగస్టర్ దగ్గర పెరుగుతాడు. అతన్ని రెండు సార్లు రక్షించటంతో అతని నమ్మకం పూర్తిగా సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో మైఖేల్ కు జీవితంలో కేవలం ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది. ఈ లోగా తనని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తుల్లో రతన్ (అనీష్ కురువిల్లా)ను తప్ప మిగతా అందర్నీ చంపిన గురునాథ్.. ఆ మిగిలిన ఒక్కడ్ని, అతడి కూతురు తీర (దివ్యాంశ కౌశిక్)ను చంపే బాధ్యతను మైఖేల్ అప్పచెప్తాడు. రతన్‌ను పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన మైఖేల్.... తీర ప్రేమలో పడతాడు. ఆ తర్వాత రతన్ దొరికినా చంపకుండా వదిలేస్తాడు. ఆ టైమ్ లో గురునాథ్ కొడుకు అమర్‌నాథ్ (వరుణ్ సందేశ్) గురించి ఓ విషయం పంచుకుంటాడు.
ఇంతకీ ఆ విషయం ఏమిటి?ఇంతకీ మైఖేల్ లక్ష్యం ఏంటి? ఎవరికీ తెలియకుండా అసలు మైఖేల్ దాస్తున్న తన గతం ఏంటి? మైఖేల్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? ఈ విషయంలో ఎవరు తనకి సహాయం చేశారు? ఎవరి వల్ల అడ్డంకులు ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది? రతన్‌ను చంపకుండా వదిలేసిన మైఖేల్‌ను గురునాథ్ ఏం చేశాడు? మైఖేల్ కథకు గురునాథ్.. అతని భార్య చారులత (అనసూయ)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్‌ల పాత్రలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
కథా బ్యాక్ డ్రాప్ కు అణుగుణంగా చేసిన స్టైల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ వాటిని కూర్చిన కథ మాత్రం సరిగ్గా సెట్ కాలేదు. మైఖేల్ క్యారక్టర్ ఇంట్రడక్షన్, డైలాగులతో కథను నడిపించిన విధానం ‘కెజీయఫ్’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అందులో కనిపించే టైట్ గా పరుగెత్తే స్క్రీన్‌ప్లే ఇందులో ఏమాత్రం ఉండదు. అసలు హీరో,హీరోయిన్స్ మైఖేల్ - తీరల మధ్య ప్రేమలో ఏమాత్రం ఫీల్ కనిపించదు. దీంతో వారి కథకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేరు. ఇంట్రవెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై ఇంట్రస్ట్ పెంచినా తర్వాత నిలబెట్టలేకపోయింది.ఇక చివరి పావుగంట అయితే యాక్షన్ హంగామా, బుల్లెట్ల మోత తప్ప ఏమీ ఉండదు. ఆ క్లైమాక్స్ సైతం ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే ఉంది.