సందీప్ కిషన్, నవదీప్ హీరోలుగా తమన్నా హీరోయిన్ గా 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్, నవదీప్, తమన్నాలు రానా నిర్వహిస్తోన్న 'నెం 1 యారి' షోకి హాజరయ్యారు. 

ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఈ షో మొత్తం తమ బోల్డ్ కామెంట్స్ తో నవ్వులు పూయించేశారని ప్రోమో ద్వారా తెలుస్తోంది. ముందుగా తమన్నా.. రానాని మీరు సింగిలేనా..? అని ప్రశ్నించగా దానికి రానా అవునని చెప్పగా.. పక్కనే ఉన్న నవదీప్ ఎప్పుడూ సింగిలే అని పంచ్ వేశాడు.

నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏంటి...? అని సందీప్ ని కిషన్ ని రానా ప్రశ్నించగా ఆ సెకన్ లో సందీప్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూసి అక్కడున్న అందరూ నవ్వారు. మధ్యలో కండోమ్ టాపిక్ రాగా.. సందీప్ కిషన్ 'కండోమ్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి కొన్నాను' అని చెబుతుండగా నవదీప్.. 'ఇంకానయం ఎలా వాడతారో చూడ్డామనుకోలేదు' అంటూ పంచ్ వేశాడు. ఇలా ప్రోమోని మొత్తం బోల్డ్ కామెంట్స్, నవ్వులతో నింపేశారు. పూర్తి షో కోసం ఆదివారం వరకు ఎదురుచూదాల్సిందే!