ఫేక్ కలెక్షన్స్ జోరు ఈ మధ్యకాలంలో తెలుగులోనూ బాగా పెరిగిపోయిన సంగతె తెలిసిందే. ఏదన్నా పెద్ద సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫేక్ కలెక్షన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ లో కనపడుతున్నాయి. ఈ విషయమై హీరోలు,నిర్మాతలకు విషయం తెలిసినా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ  రనజీతో పేట సినిమా నిర్మించిన సన్ పిక్చర్స్ వారికి అది ఇష్టం లేనట్లుంది. వాళ్లు మాకే తెలియని కలెక్షన్స్ ..ఆ ట్రాకర్స్ కు ఎలా తెలుస్తున్నాయి. అవన్నీ ఫేక్ కలెక్షన్స్. అభిమానులు వాటిని నమ్మొద్దు. మీరు చక్కగా పండగకు రిలీజైన సినిమాలన్ని చూడండి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు తమిళనాట సంచలనమైంది. 

ఇక సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘పేట’. ఈ చిత్రం తమిళనాడు, తెలుగురాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ విడుదలై మిక్సెడ్  టాక్ తెచ్చుకుంది. అమెరికాలోని 220 లొకేషన్లలో రిలీజైన ‘పేట’ భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ప్రీమియర్ షోల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం 5,45,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.84 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. 

అయితే గతంలో విడుదలైన రజినీ సినిమాలు 2.ఓ, కబాలి చిత్రాలే భారీ ఓపినింగ్స్ సాధించినట్లు చెప్పారు. వాటి పోల్చితే ఈ పేట వెనకబడిందని, అయితే పూర్తి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు.

 కాగా ఈ ‘పేట’లో రజినీ సరసన సిమ్రాన్, త్రిష నటించారు. వీరితో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అనురుధ్ సంగీతం అందించారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌లో కళా నిధిమారన్ నిర్మించగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వల్లభనేని అశోక్ తెలుగులో విడుదల చేశారు.