అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కెరీర్ ప్రారంభమై ఇంతకాలం అయ్యినా ..ఇప్పిటకీ ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన కపటధారి సైతం వర్కవుట్ కాలేదు. అప్పుడెప్పుడో సత్యం ఆ తర్వాత మళ్లీ రావా సినిమాతో మెప్పించాడు. ఆ తర్వాత ఏ సినిమా ఆడలేదు. కమర్షియల్ గా బ్రేక్ ఇవ్వలేదు. అయితే తన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని వదిలేసుకున్నానని, కావాలనే అలా చేసానని రీసెంట్ గా సుమంత్ రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సుమంత్ తన తాజా చిత్రం కటపదారి ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాలు రివీల్ చేసారు. 

దాదాపు పన్నెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు చిత్రం అప్పట్లో  సెన్సేషన్ హిట్ సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 2007లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి. ఆ సినిమాలో పూరీ డైలాగులు.. హన్సిక క్యూట్ అందాలు.. అల్లు అర్జున్ ఫెరఫార్మెన్స్.. అలీ కామెడీ ట్రాక్ అన్నీ కలిపి దుమ్ము రేపాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో అదే పెద్ద హిట్.

 అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో అల్లు అర్జున్ కాదు.. పూరీ జగన్నాథ్ ఈ కథను  సుమంత్ కు చెప్పాడు. అప్పటికి సుమంత్... సత్యం, గౌరి, మధుమాసం, గోదావరి లాంటి సినిమాలతో సుమంత్ గుర్తింపు తెచ్చుకోవటం...   పూరీ దేశముదురు కథను ఆయనకు చెప్పాడు. అయితే హీరో సన్యాసిని ప్రేమించడం ఏంటి.. అసలు అలా జరుగుతుందా ఎక్కడైనా అంటూ సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేసాడు. ఈ విషయం తనే రివీల్ చేసారు.

 అయితే దేశమేుదురు సినిమా తను చేసి ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని చెబుతున్నారు సుమంత్. అల్లు అర్జున్ కాబట్టి అలా ఆడింది.. అంటున్నారు. పూరీ ఈ కథ చెప్పేటప్పటికీ దేశముదురు కథ పూర్తిగా రాయలేదు. జస్ట్ లైన్ మాత్రమే చెప్పడంతో నచ్చలేదు.. కానీ ఫుల్ నెరేషన్ ఇచ్చుంటే బన్నీ కాకుండా తానే ఈ సినిమా చేసుండేవాడినేమో అని ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు సుమంత్. ఒకవేళ సుమంత్ చేసి ఉంటే కెరియర్ గాడిలో పడేదేమో.. ఓ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.