Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ, గౌతమ్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో ఆ హీరో

అజ్ఞాత గూఢ‌చారి అంటూ క్యాప్ష‌న్ చివ‌ర‌లో ఉన్న అక్ష‌రాలు చూస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో స్పైగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
 

Sumanth Guest role in Vijay Devarakonda Next Film
Author
First Published Feb 1, 2023, 4:50 PM IST


విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.  'వీడీ12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆ మధ్యన విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరోలోనే సెట్స్‌పై రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మరో హీరో నటిస్తున్నారు. ఆ హీరో ఎవరు అంటే అక్కినేని సుమంత్. 

ఇక లైగర్‌తో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన విజయ్‌ ఈసారి గట్టి హిట్‌ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరి మూవీ కోసం విజయ్‌ స్పెషల్‌గా ట్యూషన్‌కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం జానపద గాయకుడు, రచయిత పెంచల్‌ దాస్‌ను విజయ్‌ సంప్రదించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వీడీ12 మూవీ కథ  చిత్తూరు ప్రాంతం చూట్టు తిరుగుతుందట. ఇందులో విజయ​ చిత్తూరు యువకుడిగా బాడీ లాగ్వేజ్‌, ఆ యాసలోనే మాట్లాడాల్సి ఉంటుందట.  అందుకోసం పెంచల్‌ దాస్‌ దగ్గర స్పెషల్‌గా ట్రెయినింగ్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు. 

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ ప‌తాకాల‌పై నాగ‌వంశీ , సాయి సౌజ‌న్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ దుస్తుల్లో ఓ వ్య‌క్తి క‌నిపిస్తున్నాడు. అత‌డు ఎవ‌ర‌న్న‌ది తెలియ‌కుండా ముఖానికి ముసుగు ధ‌రించి ఉండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నేను ఎక్క‌డివాడినో, ఎవ‌రిని మోసం చేశాను తెలియ‌దు అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న అక్ష‌రాలు ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. అజ్ఞాత గూఢ‌చారి అంటూ క్యాప్ష‌న్ చివ‌ర‌లో ఉన్న అక్ష‌రాలు చూస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో స్పైగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

స‌ముద్ర తీర ప్రాంతం, మంట‌ల్లో కాలిపోతున్న ప‌డ‌వ‌లు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్న‌ట్లు తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న 12వ సినిమా ఇది. ఇందులో అత‌డి క్యారెక్ట‌ర్ కొత్త కోణంలో సాగుతుంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios