టాలీవుడ్ లో మరో యువహీరో పెళ్ళికి సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. అశ్విన్ కి కాబోయే భార్య పేరు దీపికా అని తెలుస్తుంది.  సుమంత్-దీపికా పెళ్ళికి సర్వం సిద్ధం కాగా, అత్యంత సన్నిహితుల మధ్య త్వరలో వివాహం జరగనుందట. అయితే సుమంత్ అశ్విన్ వివాహంపై అధికారిక సమాచారం లేదు. 

పెళ్లి వార్తల నేపథ్యంలో సుమంత్ స్పష్టత ఇచ్చే అవకాశం కలదు. 2012లో విడుదలైన తూనీగా తూనీగా సినిమాతో సుమంత్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాను ఆయన తండ్రి ఎమ్మెస్ రాజు స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు. 

హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా సుమంత్ అశ్విన్ కి సరైన బ్రేక్ రాలేదు. ఇక నిహారిక హీరోయిన్ గా హ్యాపీ వెడ్డింగ్ మూవీ చేశాడు సుమంత్. ఆయన నటించిన అంతకు ముందు ఆ తరువాత ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన ఇదే మా కథ అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్, భూమిక ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తుంది.