మహేష్ అభిమానుల మనసును నొప్పించకుండా ఆమె వేసిన కౌంటర్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్ సుమ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె వేసే కౌంటర్లు నవ్విస్తాయే గాని నొప్పించవ్. అందుకే సుమ అంటే అందరికి అభిమానం. ఇక మహేష్ అభిమానుల మనసును నొప్పించకుండా ఆమె వేసిన కౌంటర్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
కొంతమంది అభిమానులు ఈవెంట్ లో లైట్స్ స్టాండ్స్.. అలాగే ఫ్లడ్ లైట్స్ స్తంభాలను.. బారి కెట్స్.. వంటి వాటిని లేక చేయకుండా పైకి ఎక్కుతూ ఉండడంతో సుమ వారికి ఎంతో సున్నితంగా వివరించే ప్రయత్నం చేశారు.
మాకు తెలుసు మీరందరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటూ ఉంటారని.. కానీ ఇలా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు అలా ఎత్తులకు ఎక్కకూడదమ్మా.. అది మీకే కాదు.. చుట్టూ పక్కల ఉన్నవారికి కూడా ప్రమాదం. కాబట్టి మీరు ఎక్కినా ఆ ఎత్తుల నుంచి దిగవల్సిందిగా సభా ముఖంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న అక్కా చెల్లి అందరూ మీ కోసం ఎదురుచూస్తుంటారు సో పండుగాళ్లందరూ దిగండమ్మా అని సుమ స్వీట్ కౌంటర్ ఇచ్చారు.
