Asianet News TeluguAsianet News Telugu

Bubble Gum Teaser : సుమ కొడుకు రోషన్ నటించిన ‘బబుల్ గమ్’ టీజర్.. ఎలా ఉందంటే?

యాంకర్ సుమ కొడుకు హీరోగా పరిచయం అవుతూ వస్తున్న చిత్రం ‘బబుల్ గమ్’ (Bubble Gum). తాజాగా మూవీ టీజర్ విడుదలైంది. గ్రాండ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని లాంచ్ చేయడం విశేషం. 
 

Suma Son Roshan Kanakalas Bubble Gum movie Teaser Relased NSK
Author
First Published Oct 10, 2023, 5:54 PM IST

స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala)  హీరోగా పరిచయం అవుతూ రూపుదిద్దుకున్న చిత్రం ‘బబుల్ గమ్’ (Bubble Gum). ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీ విమల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. 

రీసెంట్ గానే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక తాజాగా టీజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని (Nani) గెస్ట్ గా హాజరయ్యారు. టీజర్ ను లాంచ్ చేశారు. యూనిట్ కు అభినందలు తెలిపారు. ప్రస్తుం టీజర్ యూట్యూబ్ లో మంచి స్పందనను అందుకుంటోంది. 

న్యూ ఏజ్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారని అర్థం అవుతోంది. రోషన్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. కర్లీ హెయిర్, తన డ్రెస్సింగ్ పూర్తిగా ఆకట్టుకుంటున్నాయి. దానితోడు మాస్ ఎలిమెంట్స్ కూడా అందించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. తొలిచిత్రంతోనే రోషన్ పెర్ఫామెన్స్ ఇరగదీస్తారనిపిస్తోంది. టీజర్ లోని డైలాగ్స్, బీజీఎం, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే రాజమౌళి, నాని సినిమాకు సపోర్ట్ చేయడంతో బజ్ క్రియేట్ అయ్యింది. 

టీజర్ ఈవెంట్ లో రోషన్ కనకాల మాట్లాడుతూ.. రాజమౌళి పుట్టినరోజునే తమ టీజర్ ను నాని చేతుల మీదుగా లాంచ్  చేయడం సంతోషంగా ఉందన్నారు. మున్ముందు అప్డేట్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్నారు. ఇక ఈ చిత్రంతో రోషన్ తో పాటు మానస చౌదరి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. మరికొందరు నూతన నటీనటులు అలరించనున్నారు. చిత్రానికి సురేష్ రఘుటు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios