స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ప్రోగ్రామ్స్ లో క్యాష్ ఒకటి. చాలా కాలంగా సుమ ఈ షోని సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. అత్యధిక టీఆర్పీ కలిగిన షోలలో క్యాష్ కూడా ఒకటి. సెలెబ్రిటీలు పాల్గొనే ఈ ప్రోగ్రాంలో ఆమె అడిగే ప్రశ్నలు, కామెడీ పంచ్ లతో పాటు ప్రైజ్ మనీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

ఈ ప్రోగ్రాంకి సబంధించిన తాజా ప్రోమో విడుదల చేయగా ఆసక్తిరేపుతుంది. గత సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ఉన్న శివ జ్యోతి, రవి కృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామి, ప్రణవి ఈ షోలో గెస్ట్స్  గా పాల్గొన్నారు. రవి కృష్ణ కామెడీ టైమింగ్, నవ్య స్వామితో రొమాన్స్ షోలో హైలెట్ గా నిలిచాయి. రొమాంటిక్ సాంగ్స్ కి వీరిద్దరూ వేసిన స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి. 

రవి కృష్ణ యాంకర్ సుమ, శివ జ్యోతిపై వేసిన పంచ్ లు కూడా బాగా పేలాయి. సుమ ఇక తనదైన టైమింగ్ తో ఆకట్టుకుంది. సరదాగా సాగిన ఈ ప్రోమో ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది. యాంకర్ సుమతో పాటు, రవి కృష్ణ, శివజ్యోతి, నవ్య స్వామి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి వీరు ఇంతలా ఏడవడం వెనుక కారణం ఏమిటో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. అక్టోబర్ 10న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.