కరోనా కారణంగా అన్ని రంగాలు స్థంభించిపోయాయి. దాదాపు రెండు నెలల పాటు అన్ని ఇండస్ట్రీల కార్యకలాపాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రభావం సినీ, టీవీ రంగాల మీద ఎక్కువగా ఉంది. ఈ రంగాల్లో పనిచేసేవారు పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంత మందికి ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా పని లేకపోవటంతో బోర్ ఫీల్ అవుతున్నారు.

తాజాగా అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది స్టార్ యాంకర్‌ సుమ. రియాలిటీ షోస్‌కు యాంకర్‌గా, సినీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే స్టార్‌ యాంకర్‌ సుమ. వ్యాఖ్యతగా సుమ ఎంత బిజీ అంటే ఆమె డేట్‌ను బట్టి సినీ కార్యక్రమాలు షెడ్యూల్‌ చేస్తుంటారన్న జోకులు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. ఆ రేంజ్‌లో బిజీగా ఉంటుంది సుమ. ఉదయమంతా టీవీ కార్యక్రమాల షూటింగ్, సాయంత్రం సినిమా వేడుకలకు యాంకరింగ్ ఇలా రోజుకు రెండు మూడు షిప్ట్‌లు పనిచేస్తుంటుంది సుమ.

అయితే లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో దాదాపు 70 రోజులుగా సుమ కూడా ఇంటికే పరిమితమైంది. అడపాదడపా తన సొంత యూట్యూబ్‌ చానల్‌ కోసం వీడియోలు చేసిన పూర్తి స్థాయిలో పని మాత్రం లేదు. దీంతో తన సిచ్యువేషన్‌ను అభిమానులతో పంచుకుంటూ, అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటకు డ్యాన్స్ చేసింది సుమ. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ `చాలా రోజులుగా పని లేని ఎఫెక్ట్‌.. జోరో (సుమ పెంపుడు కుక్క)కి ఏమీ అర్ధం కావటంలేదు` అంటూ కామెంట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Longtimenoworkeffects , zorro is mad at me

A post shared by Suma Kanakala (@kanakalasuma) on Jun 6, 2020 at 2:20am PDT