కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కించిన “జయమ్మ పంచాయితీ”లో సుమ టైటిల్ రోల్ పోషించారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది.
బుల్లితెరపై నంబర్‌వన్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సుమకు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆమె కెరిర్ మొదట్లో పలు చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత పలు కారణాల వలన సినిమాల్లో నటించలేదు. కేవలం టీవికు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత సుమ మళ్ళీ వెండి తెరవైపు ఎంట్రీ ఇచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కించిన “జయమ్మ పంచాయితీ”లో సుమ టైటిల్ రోల్ పోషించారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో జూన్ 14న స్ట్రీమింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు అక్కడ కూడా మంచి ప్రశంసలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. థియోటర్ లో చూడనివారు, సుమ అభిమానులు ఖచ్చితంగా ఓటిటిలో ఈ సినిమాని ఆదరించే అవకాసం ఉంది.
చిత్రం కథేమిటంటే... కొంచెం దుడుకుతనం ఉన్న భోళామనిషి జయమ్మ (సుమ). ఊళ్లో సమస్యలన్నీ తన సమస్యలుగా భావిస్తుంటుంది. పొరుగోళ్లకి సాయం చేయడమంటే ఇష్టం. తిరిగి సాయం చేయకపోతే మాత్రం ఊరుకోదు. ఊరంతా తనదే అనుకునే తత్వం. కుటుంబంతో కలిసి హాయిగా జీవితం గడుపుతుంటుంది. ఇంతలోనే భర్త (దేవీప్రసాద్)కి జబ్బు చేస్తుంది. డబ్బు అవసరమవుతుంది. తనకి ఎదురైన ఈ సమస్య తీరాలంటే పంచాయితీకి వెళ్లాల్సిందే అని నిర్ణయిస్తుంది. కానీ పంచాయితేమో వేరే సమస్యతో తలమునకలై ఉంటుంది. మరి జయమ్మ సమస్యకి పరిష్కారం దొరికిందా? లేదా?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. పల్లెటూరు అనగానే ఓ ప్రత్యేకమైన జీవన విధానం కనిపిస్తుంది. కల్మషం లేని మనస్తత్వాలు, అమాయకత్వం కలగలిసిన జీవితాలే స్ఫురిస్తాయి. వీటికితోడు మూఢ నమ్మకాలు, అసమానతల వంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ వాతావరణాన్ని అత్యంత సహజంగా కళ్లకు కట్టిన చిత్రమిది. ఈ చిత్రాన్ని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇందులో దినేష్ కుమార్, షాలినీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో యాంకర్‌గానే కాకుండా మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది సుమ.
