గ్లామర్ షో చేయడానికి వయసుతో సంబంధం లేదన్నట్లుగా కొందరు తారలు రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ లో నాలుగు పదుల వయసు దాటిన భామల హాట్ షో ఎక్కువవుతోంది. మలైకా అరోరా, శిల్పా శెట్టి వంటి తారలు ఇప్పటికీ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ నేటి హీరోయిన్ల మాదిరి ఎక్స్ పోజ్ చేస్తూ కనిపిస్తున్నారు.

ఈ లిస్ట్ లో నటి అమీషా పటేల్ కూడా చేరింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం బాలీవుడ్ లో 'కహోనా ప్యార్ హై' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్... ఆ తరువాత తెలుగులో 'బద్రి' సినిమాలో నటించింది. మొదట్లో తన కెరీర్ బాగానే సాగినప్పటికీ ఇప్పుడు మాత్రం అవకాశాలు లేవనే చెప్పాలి. 

కెరీర్ తో సంబంధం లేకుండా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకోవాలని చూస్తుంది కానీ అది కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. తాజాగా ఆమె మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది.

ఈ ఫోటోలు ఎంత హాట్ గా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.