హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ మార్చిన 4న రిలీజ్ కానుంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించి అప్డేట్ ను అందించారు. శర్వానంద్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చే న్యూస్ అందించారు.
వరుస సినిమాలతో అలరిస్తున్న శర్వానంద్ ( Sharwanand) ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఆయన నటించిన రెండు సినిమాల్లో ఒకటి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కాగా.. రెండో ది ‘ఒకే ఒక జీవితం’. అయితే గతంలో ఈ రెండు మూవీలను రిలీజ్ చేసేందుకు ఒకే డేట్ ఫిబ్రవరి 25ను బ్లాక్ చేశారు. కానీ ‘భీమ్లా నాయక్’ మూవీ అదే డేట్ ను లాక్ చేయగా అటు ఈ రెండు మూవీలతో పాటు అటు వరణ్ తేజ్ నటించిన ‘గని’, కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524’మూవీ రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకుంటున్న శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎల్లుండి రిలీజ్ కానుంది. ఇఫ్పటికే హైదరాబాద్ లోని శిల్పారామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ శర్వానంద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ అందించారు. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీకి ప్రత్యేకంగా వాయిస్ అందించారంట. మరోవైపు డైరెక్షన్ లోనూ సహకరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ సుకుమార్ కు సోషల్ మీడియా వేదికన ధన్యవాదాలు తెలిపారు. ఇక ‘పుష్ప’ ఘన విజయాన్ని సాధించడంతో.. పుష్ప పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు సుకుమార్..
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుజిత్ సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా ఆల్ ఇండియా క్రష్ ‘రష్మిక మండన్న’ నటించింది. కాగా ఈ మూవీని మార్చి 4న రిలీజ్ చేస్తున్నారు.
