సెలబ్రెటీలకు చెందిన ఫ్యామిలీ ఫొటోలు ఎప్పుడూ అభిమానులకు పండగ చేస్తూంటాయి. రంగస్దలంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఓ ప్రక్క మహేష్ తో చేయబోయే చిత్రానికి స్రిప్టు వర్క్ చేస్తూ మరో ప్రక్క తన కుటుంబంతో ఎంగేజ్ గా ఉన్నారు. ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ ఫోటో చూస్తే అర్దమవుతుంది. ఈ ఫోటోలో సుకుమార్ తన కుమారుడుని ఉప్పు బస్తా  ఆటలా అంటే వీపు మీద మోస్తూ కనపడగా క్లిక్ మనిపించింది. 

ఎప్పుడు మెగా ఫోన్ పట్టుకుని బిజిగా ఉంటూ, స్క్రిప్టులు రాసుకుంటూ ఉండే ఆయన హఠాత్తుగా ఇలా కనపడటం ఆశ్చర్యపరిచే విషయమే. ఇక ఎక్కడికి తీసుకెళ్లాలో సుకుమార్ కు ఈ పిల్లాడు చెప్తున్నారు.  వరసపెట్టి షెడ్యల్స్ తో తన తండ్రి బిజీగా ఉండి గ్యాప్ వచ్చాక..కలవటంతో ఇక వదిలే ప్రసక్తి లేదు అన్నట్లుగా ఉన్నాడు. ఏదైమైనా ఫ్యామిలీ టైమ్ .. అన్నిటికన్నా గొప్పది కదా..

ఇక సుకుమార్ ఫ్రొపిషన్ విషయానికి వస్తే... మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు  ఆ మధ్యనే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ (సీవీఎం) ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 

వచ్చే సంవత్సరం ప్రారంభంలో  ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. సుకుమార్, మహేష్‌బాబు కలయికలో 1 నేనొక్కడినే వంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయిలో సినిమా రాబోతుండటం విశేషం.