స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుక సంధర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎవరో నాకు తెలియదని వేదిక సాక్షిగా సుకుమార్ అన్నారు. బాలనటుడిగా కూడా ఒకటి రెండు సినిమాలు చేసిన వైష్ణవ్ ఎవరో తెలియనడం ఆసక్తికరంగా మారింది. సుకుమార్ తన స్పీచ్ లో పలు అంశాలు ప్రస్తావించగా వాటిలో ఇది కూడా ఉంది. ముఖ్యంగా చిరంజీవిపై సుకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. 

మేనల్లుడు కోసం ఆరు గంటలు కూర్చొని ఆయన కథ విన్నారని, కథను జడ్జ్ చేయడంలో ఆయన చాలా గొప్పవారని సుకుమార్ అన్నారు. మెగా హీరోలు అందరూ సక్సెస్ కావడం వెనుక చిరంజీవి సూచనలే కారణం అని సుకుమార్ పరోక్షంగా అన్నారు. అయితే తన శిష్యుడు మరియు ఉప్పెన దర్శకుడు సానా బుచ్చిబాబును పొగిడే క్రమంలో వైష్ణవ్ తేజ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు. 

బుచ్చి బాబు సక్సెస్ అవుతాడని నాకు నమ్మకం ఉండేది కాదు, కానీ ఉప్పెన కథ విన్నాక నమ్మకం కలిగింది అన్నాడు. ఉప్పెన సినిమా కోసం బుచ్చి బాబు ఎంచుకున్న నటులలో వైష్ణవ్ తేజ్ ఒకరని, కానీ అతడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే భావాలు పలికే కళ్ళు ఉన్న వైష్ణవ్ కి మంచి భవిష్యత్ ఉందని, అతని హృదయం చాలా మంచిది అని, సుకుమార్ తరువాత పొగడ్తలతో ముంచెత్తాడు.