ఛలో సినిమాతో నాగశౌర్య టైమ్ స్టార్ట్ అయినట్లే అయ్యి ఆగిపోయింది. తర్వాత వచ్చిన నర్తనశాల సినిమా నాగశౌర్యని మళ్ళీ ప్లాఫ్ ల రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. అయితే లక్ ఫ్యాక్టర్ ఇంకా నాగశౌర్యని విడిచిపెట్టినట్లులేదు. చిన్న చిత్రాలను తెరకెక్కిస్తోన్న దర్శకుడు సుకుమార్‌ తన నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో నాగశౌర్య కు అవకాసం ఇచ్చారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు.

నాగశౌర్య హీరోగా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో ఈ  చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాతో ‘రంగస్థలం’ చిత్రానికి రచయితగా పని చేయడంతో పాటు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశి విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఈ  చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క చివరి దశలో వుంది. సుకుమార్ స్క్రిప్టు కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

ఇక ఈ ఎనౌన్సమెంట్ ని హడావిడికి ఇవ్వటానికి కారణం...హీరో నాగశౌర్య కెరీర్‌లో వన్నాఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్స్‌గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఈ  కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ చెయ్యాలనుకోవటమే అని తెలుస్తోంది.