టాలీవుడ్ స్టార్ దర్శకులు నిర్మాతలుగా అడుగులు వేస్తుండడం కామన్. పూర్తిగా ప్రొడ్యూసర్ గా కాకపోయినా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే గతంలో లాగా శిష్యులకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే దర్శకులు కరువయ్యారు. కానీ సుకుమార్ ఇప్పుడు తన స్టూడెంట్స్ కోసం నిర్మాతగా ముందుకు సాగుతున్నాడు. 

ఇదివరకే కుమార్ 21F నిర్మించి తన సీనియర్ శిష్యుడైన ప్రతాప్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సుకుమార్ మరోసారి అతనికి అవకాశం ఇవ్వడానికి సిద్దమయ్యాడు. నితిన్ హీరోగా ఆ సినిమా తెరకెక్కనుంది. ఇక మైత్రి - గీత ఆర్ట్స్ ని ఒకటి చేస్తూ వారి సపోర్ట్ తో కాశిరెడ్డి అనే మరో యువ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నాడు. అందులో యువ హీరో నాగశౌర్య కథానాయకుడు. 

ఇక ఫైనల్ గా కొంచెం ఎక్కువ ఖర్చుతో మైత్రి మూవీ మేకర్స్ ని కూడా భాగస్వామ్యంగా చేసుకొని బుచ్చి బాబు అనే మరో శిష్యుడి చేతిలో మెగా హీరో  సినిమా పెట్టాడు.  మెగాస్టార్ మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ తో ఆ కొత్త సినిమాను నిర్మించేందుకు సుకుమార్ సిద్దమయ్యాడు. ఓ వైపు మహేష్ సినిమా చేస్తూనే తన ముగ్గురి స్టూడెంట్స్ యొక్క చిత్రాలను నిర్మించేందుకు సుకుమార్ భారీగా పెట్టుబడి పెట్టనున్నాడు. మరి సుకుమార్ చేస్తోన్న ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.