Asianet News TeluguAsianet News Telugu

పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ..తృప్తి డిమ్రి విషయంలో భయపడుతున్నారా ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. అయితే ఇంకా పూర్తి చేయాల్సిన షూటింగ్ చాలా ఉందట. అందుకే సుకుమార్ అండ్ టీమ్ రిలీజ్ డేట్ మిస్ కాకుండా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Sukumar planning to shoot Pushpa 2 item song on Tripti dimri dtr
Author
First Published May 23, 2024, 6:29 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. అయితే ఇంకా పూర్తి చేయాల్సిన షూటింగ్ చాలా ఉందట. అందుకే సుకుమార్ అండ్ టీమ్ రిలీజ్ డేట్ మిస్ కాకుండా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 చిత్రం మొదటి భాగం కంటే భారీ పాన్ ఇండియా హిట్ కావాలనేది మూవీ టీం టార్గెట్. 

దానికోసం చిన్న అవకాశం కూడా విడిచి పెట్టడం లేదు. సుకుమార్ సినిమా అన్నాక ఐటెం సాంగ్ కంపల్సరీ. పుష్ప మొదటి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఇప్పుడు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరు అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఐటెం సాంగ్ గురించి బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుక్కు ఆల్రెడీ ఆమెని ఫైనల్ చేశారట. నెవర్ బిఫోర్ హంగామా మాస్ డ్యాన్స్ ఉండేలా స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేస్తున్నారట. 

అయితే యానిమల్ చిత్రంతో తృప్తి డిమ్రి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కి ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. కానీ చిత్ర యూనిట్ ఒకే ఒక్క విషయంలో భయపడుతున్నారు. అల్లు అర్జున్ తో కలసి ఆమె డ్యాన్స్ మూమెంట్స్ పర్ఫెక్ట్ గా చేయగలదా అని సందేహ పడుతున్నారట. కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా డ్యాన్స్ మూమెంట్స్ పర్ఫెక్ట్ గా చేయించాలని అనుకుంటున్నారట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios