రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న సుకుమార్ ప్రస్తుతం మహేష్ కోసం కథను రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో కొద్దిగా సేద తీరుతూ మహేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కథను అల్లుతున్నాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. 

ఇకపోతే సుకుమార్ పనిలో పనిగా మహేష్ కథతో పాటు ప్రభాస్ కోసం కూడా మరొక కథను పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రభాస్ తో ఎప్పటినుంచో వర్క్ చేయాలనీ సుక్కు అనుకుంటున్నాడు. అయితే అతను అస్సలు దొరకడం లేదు. సాహూ - రాధాకృష్ణ ప్రాజెక్ట్స్  అయిపోగానే ప్రభాస్ డేట్స్ తీసుకోవాలని సుక్కు ముందుగానే ఒక పాయింట్ ను సెట్ చేసుకున్నాడట. 

ఇక తాను మహేష్ కథతో బిజీగా ఉంటూ తన రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు ప్రభాస్ స్టోరీని డెవలప్ చేయమని పని అప్పగించినట్లు సమాచారం. ప్రభాస్ కూడా సుకుమార్ తో చేయాలనీ అనుకుంటున్నాడు. ఆ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి సుక్కు మహేష్ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.