శివ‌నాగులు పాట గురించి క్లారిటీ ఇచ్చిన సుకుమార్

First Published 2, Apr 2018, 3:13 PM IST
Sukumar Giving Clarity on About Rangasthalam Song Aa Gattunutava Naganna
Highlights
శివ‌నాగులు పాట గురించి క్లారిటీ ఇచ్చిన సుకుమార్

 

రామ్‌చ‌ర‌ణ్‌,సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `రంగ‌స్థ‌లం`. మార్చి 30న విడుద‌లైన ఈ సినిమా పెద్ద హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తూ ముందుకెళుతుంది. ఈ సినిమాలోరాజ‌కీయాల నేప‌థ్యంలో వ‌చ్చే `ఆ గ‌ట్టునుంటావా! … నాగ‌న్న ఈ గ‌ట్టుకొస్తావా!` అనే పాట‌ను ముందు జాన‌ప‌ద గేయ‌కారుడు శివ‌నాగులుతోపాడించారు. అయితే చివ‌ర‌కు సినిమాలోదేవిశ్రీ ప్ర‌సాద్ వాయిస్ వినిపించ‌డంతో.. కొంత మంది దేవిశ్రీపై ఫైర్ అయ్యారు. అయితే దీని గురించి ద‌ర్శ‌కుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ముందు శివ‌నాగులు పాట పెట్టాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న గొంతు రామ్‌చ‌ర‌ణ్‌కి సూట్‌కాద‌నిపించ‌డంతో దేవితో పాట పాడించార‌ట‌. దేవి పాడినే పాట‌నే సినిమాలో విన‌ప‌డింది. మ‌రి సుక్కు క్లారిటీ త‌ర్వాత దేవిపై విమ‌ర్శ‌లు త‌గ్గుతాయో లేవో…

 
loader