Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ ఆరోగ్యం బాగోలేదా..? `పుష్ప` వెయిటింగ్‌కి కారణమదేనా?

  సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు.  ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు.

Sukumar Battling with Viral Fever? jsp
Author
Hyderabad, First Published Jul 24, 2021, 4:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. అది వైరల్ ఫీవర్ అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  సుకుమార్ కి వైరల్ ఫీవర్ రావడంతో మూడు రోజులుగా జరగాల్సిన పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక సుకుమార్ మొదటి నుండి కూడా ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉంటారు. ఒక్కో హోమియోపతి మాత్రమే వాడుతుంటారు.ఈసారి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. 

  సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు.  ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ రీసెంట్ గా పునఃప్రారంభమైంది.  సికింద్రాబాద్‌లో షూటింగ్‌ జరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్టు రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ మరో 45 రోజుల్లో పూర్తికానున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ పేరుతో ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌- అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది.

మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ విడుదలైన ఆరు నెలల తరువాత సెకండ్ పార్ట్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios