ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా బాలయ్య సూపర్ హిట్ షో ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


‘ఈలోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే’ అంటున్నాడు పుష్పరాజ్‌. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ...’ అంటూ గడుసైన సమాధానమే ఇస్తూ ధియోటర్ లోకి దూకాడు . అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. రష్మిక హీరోయిన్. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందించారు. సుకుమార్‌ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా బాలయ్య సూపర్ హిట్ షో ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందీ అంటే...

‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ల విషయంలో ఒక్క అల్లు అర్జున్ పోస్టర్ మినహా, మిగిలిన అన్ని పోస్టర్లపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ రష్మిక మాత్రం తన ఫస్ట్ లుక్ పోస్టర్ పై ముందే చెప్పిందట. చెవులకు దిద్దులు పెట్టుకుంటూ పైట లేకుండా కూర్చోని ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ రిలీజ్ కు కొద్ది సమయం ముందే రష్మికకు పోస్టర్ పంపించగా, ఈ పోస్టర్ అయితే తనపై నెగటివ్ అభిప్రాయాలు వస్తాయని రష్మిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందట. 

ఇది తెలుసుకున్న సుకుమార్, తాను ఎంతో కష్టపడి, ఆలోచించి రిలీజ్ చేస్తోన్న పోస్టర్ పై రష్మిక అలా అన్నందుకు తీవ్ర కోపం వచ్చిందట. ఎవరెన్ని చెప్పినా తాను అనుకున్న పోస్టర్ నే రిలీజ్ చేస్తానని, ఆ పోస్టర్ ను రిలీజ్ చేసానని, కానీ తర్వాత రష్మిక చెప్పిందే నిజమైందని సుకుమార్ చెప్పుకొచ్చారు. 

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో సుక్కు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… ఈ సందర్భంగా తాను రష్మికకు ‘సారీ’ చెప్తున్నానని అన్నారు. 

Also Read ;Naga Shaurya:ఓటీటిలో గమ్మత్తు..నాగశౌర్యకు నాగశౌర్యే పోటి