నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లక్ష్య. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.  


సాధారణంగా థియోటర్ లో అయినా ఓటీటిలో అయినా ఒక హీరోకు మరో హీరో సినిమాకు మధ్య పోటీ ఉంటుంది. కానీ చిత్రంగా ఓటీటిలో ఓ గమ్మత్తు చోటు చేసుకుంది. నాగశౌర్య సినిమాలు రెండు ఓటీటిలో ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. నాగశౌర్య నటించిన లక్ష్య, వరుడు కావెలను రెండు చిత్రాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటిలో విడుదుల అవుతున్నాయి. రెండు జనవరి 7 నుంచే ప్రేక్షకులను ఓటీటిలలో అలరించనున్నారు. దాంతో ఇదే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నాగశౌర్య నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘లక్ష్య’. థియేటర్లలో ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ కథకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సరసన కేతికశర్మ మెరిసింది. జగపతిబాబు, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 ఈ సినిమా కోసం నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు నాగశౌర్య. తాజాగా ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది.

Also read నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

ఈ మూవీలో ఆకాష్‌ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూవర్మ కనిపిస్తారు. సీనియర్ నటి నదియా హీరోయిన్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దర్శకురాలు లక్ష్మీసౌజన్య తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించారు.

Also read Un stoppable:అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇలా ఉందేంటి?