బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అతనితో సినిమా చేయాడాని పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు క్యూలో ఉన్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ అవకాశాన్ని అందుకున్నాడు. సాహో కథతో ప్రభాస్ ని మెప్పించి తెరకెక్కించే పనిలో పడ్డాడు. తెలుగు సినిమా చరిత్రలో రెండు మూడు బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలు కొడితే గాని రాని లక్ మనోడికి ఒక్క సినిమాతోనే వచ్చేసింది. దానికి తోడు సుజిత్ ప్రభాస్ స్నేహితులు కావడం కూడా ఛాన్స్ ఇవ్వడానికి కారణం.

కానీ రన్ రాజా రన్ సినిమాతో చిన్న బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టిస్తున్నారు దర్శకుడు సుజీత్. నిండా 30 కూడా దాటని సుజీత్ పై నిర్మాత మరియు హీరో ఏ స్థాయిలో నమ్మకాన్ని పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన అవగాహనా ఉంటే గాని ఎవరు ఆ స్థాయిలో సినిమా చేయడానికి దైర్యం చేయలేరు. అయితే ఈ మధ్య కొన్ని మీడియాల్లో దర్శకుడిపై అలాగే ప్రభాస్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి. 

వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అనేక వార్తలు వచ్చాయి. దీంతో దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా ద్వారా రూమర్స్ ని బ్లాస్ట్ చేశాడు. విబేధాలు ఉన్నాయని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సాహో చిత్రీకరణ చాలా సాఫీగా సాగుతోందని సుజీత్ వివరణ ఇచ్చాడు. దీంతో ఫైనల్ గా ఆ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.