ఓ సినిమా షూటింగ్‌లో తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని ఆమె వెల్లడించింది సీనియర్‌ నటి సుహాసిని. హీరోయిన్‌గా చేసే రోజుల్లో ఎదురైన సంఘటన గురించి ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సుహాసిని అంటే ఒక పద్దతైన పాత్రలే గుర్తొస్తాయి. ఆమె తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. ఎప్పుడూ గ్లామర్‌ సైడ్‌ వెళ్లకుండా నటనతో మెస్మరైజ్‌ చేసింది. హీరోయిన్‌గా అనేక చిత్రాలు చేసి మెప్పించింది. గ్లామర్‌ తారల జోరు సాగుతున్న సమయంలోనూ తాను మాత్రం ఎప్పుడూ ఆ ట్రాప్‌లో పడలేదు. ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. నచ్చిన సినిమాలే చేసుకుంటూ వచ్చారు. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. 

ఇప్పుడు కూడా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఫిల్మ్ మేకర్స్ ని ఎంకరేజ్‌ చేస్తూ ముందుకు నడుస్తున్నారు. కెరీర్‌ పరంగా రాణిస్తున్నారు. సినిమా తప్పితే పూర్తి ప్రైవేట్ లైఫ్‌కే ప్రయారిటీ ఇస్తుంది సుహాసిన. భర్త, దర్శకుడు మణిరత్నంకి పరోక్షంగా బ్యాక్‌ బోన్‌లా ఉంటూ రాణిస్తున్నారు. మీడియా ముందుకు కూడా ఆమె వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. 

ఓ సినిమా షూటింగ్‌లో తాను ఇబ్బంది పడ్డ విషయాన్ని ఆమె వెల్లడించింది సీనియర్‌ నటి సుహాసిని. హీరోయిన్‌గా చేసే రోజుల్లో ఎదురైన సంఘటన గురించి ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సంద్భంగా ఆమె చెబుతూ, హీరోయిన్ గా చేసే రోజుల్లో అభ్యంతకరమైన, అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించేందుకు తాను నో చెప్పేదట. అలాంటి సీన్లని సున్నితంగా తిరస్కరించేదాన్ని అని చెప్పింది. ఈ సందర్భంగానే ఓ సంఘటనని పంచుకుంది సుహాసిని. 

ఓ సినిమా షూటింగ్‌లో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందట. ఆ సీన్‌ చేయాలని చెబితే సుహాసిని నిర్మొహమాటంగా నో చెప్పిందట. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు అని, తాను ఆ సీన్‌ చేయనని గట్టిగా చెప్పిందట. దానిపై చాలా వాదన కూడా జరిగిందని తెలిపింది. మరోవైపు హీరోతో కలిసి ఐస్‌ క్రీమ్‌ తినే సన్నివేశం ఉందట. అయితే హీరో తిన్న ఐస్ క్రీమ్‌ తినాలని దర్శకుడు చెప్పాడట. అది సుహాసినికి నచ్చలేదు. 

దీంతో వేరే వాళ్లు ఎంగిలి చేసిన దాన్ని తాను తినడం ఏంటి? అని ప్రశ్నించిందట. ఐస్‌ క్రీమ్‌ మార్చాలని గట్టిగా ఇచ్చిపడేసిందట. దీంతో కొరియోగ్రాఫర్‌ సైతం షాక్‌ అయ్యారని, నేను చెప్పిన విధంగా చేయాలి` అని సుహాసినిపైకి సీరియస్ అయ్యాడట. అయినా తాను అంగీకరించలేదని, ఐస్‌క్రీం తినడం కాదు, కనీసం ముట్టుకోనని తెగేసి చెప్పానని, దీంతో చేసేదేం లేక ఐస్‌ క్రీమ్‌ మార్చినట్టు తెలిపింది సుహాసిని. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.