దిగ్గజ దర్శకుడు మణిరత్నం గురించి సోమవారం ఉదయం నుంచి అనేక పుకార్లు వినిపించాయి. మణిరత్నం గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనితో మణిరత్నంకు ఏదో అయిపోయిందని అంతా కంగారుపడ్డారు. ఈ పుకార్లు సృష్టిస్తున్న వారందరి నోళ్లని సుహాసిని ఒక్క ట్వీట్ తో మూయించింది. 

మణిరత్నం గురించి వస్తున్న వార్తలపై ఆయన సతీమణి సుహాసిని సోషల్ మీడియాలో స్పదించారు. నా భర్త తదుపరి సినిమా వర్క్ కోసం ఉదయం 9:30 గంటలకే ఆఫీస్ కు వెళ్లారు. నేను తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో ఇంట్లో బిజీగా ఉన్నాను. నా భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్ కు వెళ్లారు అని సుహాసిని తెలిపింది. 

దీనితో మణిరత్నం ఆరోగ్యంపై వస్తున్న పుకార్లన్నీ పటాపంచలయ్యాయి. మణిరత్నం తదుపరి పొన్నియన్ సెల్వం చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనున్నట్లు సమాచారం.