Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో మరో నేచురల్ స్టార్ ,నానికి పోటీ ఇస్తోన్న సుహాస్..?

టాలీవుడ్ కు మరో నేచురల్ స్టార్ దొరికాడు.. కాస్త లేట్ అయినా.. మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. గ్లామర్ తో పనిలేకుండా నటనతో మనసులు దోచేస్తున్నాడు. 
 

Suhas Second Natural Star In Tollywood and Nani Verses Suhas
Author
First Published Feb 6, 2024, 4:27 PM IST | Last Updated Feb 6, 2024, 4:27 PM IST

రీసెంటుగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. హీరోగా సుహాస్ ను ఈ సినిమా మరో  మెట్టు ఎక్కించింది. ఇండస్ట్రీలోకి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సుహాస్. తన ఆటీట్యూడ్ తో, యాక్టింగ్ తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ఒక్క అవకాశాలన్ని కరెక్ట్ గా ఉపమోగించుకున్న సుహాస్.. అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. 

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగినవారు చాలా మంది ఉన్నారు. కాని  నెపోకిడ్స్ ఎక్కువగా ఉన్న ఈరోజుల్లో అలా ఎదగడం చాలా కష్టమైన పని. కాని ఎంటువంటి  నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారిలో నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ లాంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో  సుహాస్ చేరేలా ఉన్నాడు. నెక్ట్స్ సినిమా వరకూ స్టార్ హీరో అయినా ఆశ్చర్య అవసరం లేదు. 

సుహాస్  అంచలంచెలుగా ఎదుగుతున్న తీరు చూస్తుంటే అందరికి నానీనే గుర్తుకు వస్తున్నాడు. ఇక గ్లామర్ విషయంలో ఇద్దరిమధ్య తేడా ఉన్నా.. సుహాస్  కూడా యుచ్చటగానే ఉంటాడు.. ముఖ్యంగా తన ఇన్నోసెంట్ ఫేస్ తో అందరిని కట్టిపడేస్తున్నాడు సుహాస్. ఇక నెక్ట్స్ టాలీవుడ్ కునేచురల్ స్టార్ గా సుహాస్ ఫిక్స్ అని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతున్న సుహాస్ పేరు, ఇప్పుడు నాని తరువాత స్థానంలో వినిపిస్తూ ఉండటం విశేషం. కలర్ ఫోటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్..నెక్ట్స్ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. తొందరపడకుండా.. వచ్చిన అవకాశాలను సరైన మార్గంలో ఉపయోగించుకుంటూ.. తను హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు సుహాస్. 

ఇక యాక్టింగ్ లో నేచురల్ పెర్ఫామెన్స్ తో అందరికి దృష్టిని ఆకర్శిచాడుసుహాస్. నిర్మాతలు గంలో ఆలోచించారు కాని.. సుహాస్ హీరోగా సినిమా అంటే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేసుకున్నాడు యంగ్ హీరో. ఇక ముందు ముదు టాలీవుడ్ లో స్టార్ హీరోగా అవతారం ఎత్తబోతున్నాడంటున్నారు సుహాస్ ప్యాన్స్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios