హీరోకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే...


సత్యదేవ్ తాజా చిత్రం కృష్ణమ్మ వారంలోనే ఓటిటిలోకి వచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో సినిమా రిలీజైన మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు సుహాస్ హీరోగా నటించిన 'ప్రనస్న వదనం'. రిలీజ్ కు ముందు మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఫర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. అయితే ఎలక్షన్స్, ఐపీఎల్ ,ఎండలు వంటి రకారకాల కారణాలతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

 'ప్రసన్న వదనం' మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

స్టోరీ లైన్ ఏంటంటే 

రేడియో జాకీ సూర్య (సుహాస్)కి ఓ యాక్సిడెంట్ వల్ల తల్లి,తండ్రులను పోగొట్టుకోవటమే కాకుండా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చే సమస్య ఏమిటంటే...వీళ్లకు మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్‌నెస్ అంటారు. ఈ సమస్యతో బాధపడుతూనే దాన్ని అధిగమిస్తూ జీవితంలో మెల్లి మెల్లిగా సెటిల్ అవుతూంటాడు. అయితే అనుకోకుండా జీవితం మరో సమస్య అతనిపై విసురుతుంది. అతను ఓ హత్యలో సాక్షి అవుతాడు. అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

థియేటర్ లో ఆడని ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో మాత్రం బాగానే ఆడిన చరిత్ర ఉంది. దానికి తోడు ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సు ఉందనే చెప్పాలి.