Asianet News TeluguAsianet News Telugu

వైల్డ్ గా మారిన సుడిగాలి సుధీర్‌.. థియేటర్లోకి కొత్త సినిమా.. డిటెయిల్స్

 `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా నిరూపించుకున్న సుధీర్‌, ఆ మధ్య `వాంటెడ్‌ పండుగాడు`, `గాలోడు` చిత్రాలతో అలరించాడు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు సుధీర్‌. 

sudigali sudheer turn wild his new movie ready to theater details arj
Author
First Published Oct 27, 2023, 10:04 PM IST

సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer).. బుల్లితెరపై రచ్చ చేశాడు. `జబర్దస్త్` కమెడియన్‌గా పాపులర్‌ అయ్యాడు. అక్కడ యాంకర్‌ రష్మితో పులిహోర కలిపి బాగా పాపులర్‌ అయ్యాడు. ఆ పాపులారిటీ, క్రేజ్‌ని సినిమాల వైపు టర్న్ తిప్పాడు. హీరోగా మారి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. టీవీ షోస్‌ మానేసి సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాడు. `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా నిరూపించుకున్న సుధీర్‌, ఆ మధ్య `వాంటెడ్‌ పండుగాడు`, `గాలోడు` చిత్రాలతో అలరించాడు. `గాలోడు` చిత్రం మంచి కలెక్షన్లని రాబట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. 

ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. సుధీర్‌ `కాలింగ్‌ సహస్త్ర` (Calling Sahasra) అనే చిత్రంలో నటించారు. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రాక చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అప్ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ సినిమాని థియేటర్లోకి తీసుకుబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్లని విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ లుక్‌ షాకింగ్‌గా ఉంది. వీల్‌ చైర్‌లో హీరోయిన్‌ని కూర్చొబెట్టి, తను కత్తి పట్టి ఉన్నాడు, వారికి రక్తపు మరకలున్నాయి. కామెడీతో, రొమాన్స్ తో నవ్విస్తూ అలరించే సుధీర్‌, ఇలా ఒక్కసారిగా వాయిలెంట్‌గా మారడం షాకిస్తుంది. 

ఈ సినిమాలో సుధీర్‌ వైల్డ్ గా కనిపించబోతున్నారట. ఆయన పాత్ర చాలా వైల్డ్ గా, వాయిలెంట్‌గా ఉంటుందని టీమ్‌ చెబుతుంది. ఆ విషయాలను వెల్లడించింది. నిర్మాత వెంకటేశ్వరు కాటూరి మాట్లాడుతూ, ర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్‌, హీరో సుధీర్‌, హీరోయిణ్ డాలీషా స‌పోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ సూప‌ర్‌గా వ‌చ్చింది. స‌రికొత్త సుధీర్‌ను చూస్తార‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్ పాత్ర‌ను వెండి తెర‌పై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్  ఇలాంటి పాత్ర‌లో కూడా న‌టిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుంది.

 ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకోనుంది. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం ` అని తెలిపారు. `గాలోడు`తో మెప్పించిన సుధీర్‌.. `కాలింగ్‌ సహస్త్ర`తో ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ చిత్రంలో సుధీర్‌ సరసన డాలీషా హీరోయిన్‌గా చేస్తుంది. శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల  ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌ విక్కీరాల దర్శకత్వం వహిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్, రచన దర్శకత్వం: అరుణ్ విక్కీరాల, నిర్మాతలు:  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, సంగీతం : మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ : సన్ని.డి, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌, పాటలు : మోహిత్ రేహమేనియాక్, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర‌, ఫ‌ణి (బియాండ్ మీడియా).
 

Follow Us:
Download App:
  • android
  • ios