Asianet News TeluguAsianet News Telugu

‘కాలింగ్‌ సహస్ర’ఫెయిల్, అయినా నిర్మాతకి లాభమే! ఎలాగంటే

సుడిగాలి సుధీర్ ని నమ్మి చేసిన  ఈ సినిమా నష్టం తెచ్చిందా? ఎంతకు అమ్మారు? వివరాలు చూస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసాయి.

Sudigali Sudheer Calling Sahasra Box Office report jsp
Author
First Published Dec 8, 2023, 7:39 AM IST

‘జబర్దస్త్‌’తో   ప్రేక్షకులకు చేరువైన సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) హీరోగానూ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. వగతేడాది ‘గాలోడు’ చిత్రంతో బాక్సాఫీస్‌ దగ్గర హిట్ కొట్టిన సుధీర్  ఇప్పుడు ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra)తో పలకరించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. యానిమల్ రిలీజ్ రోజే విడుదలైన ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. మరి సుడిగాలి సుధీర్ ని నమ్మి చేసిన  ఈ సినిమా నష్టం తెచ్చిందా? ఎంతకు అమ్మారు? వివరాలు చూస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసాయి.
 
 కాలింగ్ సహస్ర(Calling Sahasra)రెగ్యులర్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం. డార్క్‌ వెబ్‌ మాటున జరిగే ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌ను దీనికి జోడించి కొత్తదనం అద్దే ప్రయత్నం చేశారు.  ఈ  సినిమాకి ఆడియన్స్ నుండి పెద్దగా  రెస్పాన్స్ రాలేదు.  కలెక్షన్స్ పరంగా యానిమల్ వంటి  భారీ చిత్రం పోటి  వలన అక్కడా దెబ్బతింది. దాంతో   బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా  బిజినెస్  వర్కవుట్ కాలేదనే చెప్పాలి.

ఈ వారం రోజుల్లో  కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఓవ‌రాల్‌గా కోటి వ‌ర‌కు గ్రాస్, యాభై ల‌క్ష‌ల లోపు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వర్గాల స‌మాచారం.  రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కాలింగ్ స‌హ‌స్ర రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మ‌రో కోటిన్న‌ర వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రావాల్సివున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా . అయితే అది జరిగే పనికాదు. ఎందుకంటే ఈ  గురువారం నాని హాయ్ నాన్న రిలీజైంది. వీటితో పాటు ఈ రోజు శుక్ర‌వారం ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.

అయితే నిర్మాత  స్మాల్‌స్క్రీన్‌పై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్లు స‌మాచారం. సినిమాను 2.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారట. ఇక ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి 3 కోట్ల దాకా బడ్జెట్ అవ్వగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ మొత్తం వెనక్కి వచ్చింది అని అంటున్నారు. దాంతో సినిమా ద్వారా నిర్మాతలకు మాత్రం డీసెంట్ ప్రాఫిట్స్ సొంతం అయ్యాయని,నష్టపోయింది లేదని తెలుస్తోంది.

కాలింగ్ స‌హ‌స్ర లో డాలీ షా హీరోయిన్‌గా న‌టించింది. శివ‌బాలాజీ కీల‌క పాత్ర పోషించాడు. డైరక్టర్ రాసుకున్న కథలోని క్రైమ్‌ ఎలిమెంట్‌ కొత్తగా ఉన్నా.. దాన్నిఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. ఫస్టాఫ్ పూర్తిగా నిరుత్సాహ పరిచింది. దీంట్లో రెండు పాటలున్నాయి. కానీ, ఏదీ గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం, కెమెరావర్క్ ఫర్వాలేదనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అంతంత మాత్రమే. 

Follow Us:
Download App:
  • android
  • ios