సుడిగాలి సుధీర్‌.. టెలివిజన్‌లో బాగా క్రేజ్‌ ఉన్న కమెడీయన్‌. జబర్దస్త్త్‌ తో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. టీవీ రంగంలోకి ఉన్న ఫాలోయింగ్‌తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు. గతేడాది `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. దీంతోపాటు `త్రీమంకీస్‌` సినిమాలోనూ తమ జబర్దస్త్ టీమ్‌ మెంబర్స్ రామ్‌ప్రసాద్‌, గెటప్‌ శ్రీనులతో కలిసి నటించారు. ఇది అంతగా మెప్పించలేకపోయింది.

తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు సుడిగాలి సుధీర్‌. తన మొదటి సినిమా దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల డైరెక్షన్‌లోనే మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సారి సుధీర్‌ ప్రేమ కథ చెప్పబోతున్నాడట. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని జరుపుకోబోతుంది. 

మరి ఈ సినిమా వర్కౌట్‌ అయితే, హీరోగా పేరొస్తే సుధీర్‌.. జబర్దస్త్ ని వదిలేస్తాడేమో అని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. హీరోగా ఎంత పేరొచ్చినా జబర్దస్త్ ని వదిలేది లేదు, అది నాకు జీవితాన్నిచ్చిందని సుధీర్‌ చెబుతుంటాడు. టీవీని, సినిమాలను బ్యాలెన్స్ చేస్తానని చెబుతున్నాడు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో సప్తగిరి కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.