Asianet News TeluguAsianet News Telugu

రెజినా, నివేత థామస్‘శాకినీ-ఢాకినీ’స్టోరీ లైన్ ఏంటంటే!

 ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ మార్చిలో పూర్తి కాగా.. తాజాగా తుది షెడ్యూల్ షూట్ ఇవాళ‌ తిరిగి మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా షూటింగ్ లొకేషన్‌లోని ఫొటోను చిత్రం బృందం పంచుకుంది. ఈ ఫొటోలో రెజీనా, నివేదా థామ‌స్‌, ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌, కెమెరామ్యాన్ రిచ‌ర్డ్ ప్ర‌సాద్ న‌వ్వుతూ క‌నిపించారు. 

Sudheer Varma Mid night runners movie remake started jsp
Author
Hyderabad, First Published Jul 26, 2021, 4:39 PM IST

ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ ప్రస్తుతం ‘శాకినీ – ఢాకినీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్ ను రెజీనా కసెండ్రా, నివేదా ధామస్ పోషిస్తున్నారు. గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సురేశ్ బాబు, తాటి సునీత, క్రాస్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘ఓ బేబీ’ సినిమా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కాగా, ఇప్పుడు తీస్తున్న ‘శాకినీ – ఢాకినీ’ కూడా కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కు రీమేక్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ గతంలోనే మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించామని చిత్ర టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
 
 కొరియన్ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వాళ్ల దగ్గరే రెజీనా - నివేదా శిక్షణ తీసుకున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. 

ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. ఆ క్రమంలో రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని దాటుకుని ఆ కిడ్నాప్ వెనక ఉన్న ఓ పెద్ద రాకెట్ ని బయిటపెడతారు. కొరియాలో ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో చేసారు. కానీ తెలుగుకు వచ్చేసరికి హీరోలను తీసేసి, ఇద్దరు హీరోయిన్స్ తో ఈ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మైకీ మెక్క్లరీ సంగీతం సమకూరుస్తున్నారు. విప్లావ్ నిషాడమ్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios