Asianet News TeluguAsianet News Telugu

Sudheer Babu : సుధీర్ బాబు కొత్త సినిమా అప్డేట్.. పండగపూట ఫస్ట్ లుక్..

సుధీర్ బాబు తన నెక్ట్స్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఫెస్టివల్ సందర్భంగా రేపు కీలకమైన అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నారు. 
 

Sudheer Babus Harom Hara Movie First look Updat  NSK
Author
First Published Oct 22, 2023, 8:23 PM IST | Last Updated Oct 22, 2023, 8:23 PM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ వరుసగా మూడు సినిమాలతో డిజాస్టర్ చూశారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్’, రీసెంట్ గా వచ్చిన ‘మామా మశ్చీంద్ర’ వంటి చిత్రాలు బోల్తా కొట్టాయి. హిట్, ఫ్లాప్స్ లు లెక్కచేయకుండా సుధీర్ బాబు విభిన్న కథలను ఎంచుకుంటూనే వస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనాన్ని మాత్రం పరిచయం చేస్తున్నారు. 

రీసెంట్ గా ‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయంతో అలరించారు. కానీ మూవీ పెద్దగా ప్రేక్షకులను  ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ నెక్ట్స్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. సుధీర్ బాబు లైనప్ ఉన్న మరోచిత్రం ‘హరోం హర’. యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. జ్నానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మన్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్  సంగీతం అందిస్తున్నారు. 

గతంలోనే ప్రకటించిన ఈ చిత్రం ప్రస్తుతం తుదిమెరుపులు దిద్దుకుంటోంది. ఈ సందర్బంగా మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. అప్డేట్స్ ను ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. రేపు సాయంత్రం 5 : 55 నిమిషాలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. అనౌన్స్ మెంట్ తో వదిలిన పోస్టర్ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios