Asianet News TeluguAsianet News Telugu

నెక్స్ట్ లెవల్ లో సుధీర్ బాబు నటన.. కేక పెట్టిస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా పాటలు, టీజర్స్ రిలీజ్ చేస్తోంది. 

Sudheer babu Sridevi Soda Center movie trailer
Author
Hyderabad, First Published Aug 19, 2021, 3:07 PM IST

పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా పాటలు, టీజర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ 'మందులోడా' యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

తాజాగా చిత్ర యూనిట్ శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.  ఓ సూపర్ హిట్ చిత్రానికి కావలసిన అన్ని అంశాలతో ఈ చిత్రం పర్ఫెక్ట్ మిక్స్ లాగా అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, లవ్, యాంగ్రీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

ముఖ్యంగా సుధీర్ బాబు నటన, గెటప్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి. మర్డర్ కేసులో జైలుకెళ్లిన ఖైదీగా, తన సొంత ఊర్లో లైటింగ్ సెట్ చేసే వ్యక్తిగా సుధీర్ బాబు నటనలో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఊర్లో లైటింగ్ సెట్ చేసే వ్యక్తి మర్డర్ కేసులో ఖైదీగా ఎందుకు మారాడు.. ప్రేమే కారణమా అనే ఉత్కంఠ ట్రైలర్ ద్వారానే కలుగుతోంది. 

'జైలుకు వచ్చిన మనిషి, జైలు నుంచి బయటకు వెళ్లిన మనిషి ఎప్పటికీ ఒక్కటి కాదు' లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ గా నటించిన ఆనంది పాత్ర కూడా ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల మధ్య బలమైన ఎమోషన్, లవ్ సీన్స్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. కథ కనెక్ట్ అయితే శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం హిట్ అందుకోవడం ఖాయంగా ట్రైలర్ ని చూస్తే అనిపిస్తోంది. 

దర్శకుడు కరుణ కుమార్ పలాస తర్వాత మరోసారి మ్యాజిక్ కు రెడీ అవుతున్నారు. పలాస చిత్రానికి గాను అతడు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios