వైరల్ అయిన ఓ వీడియో ఆలస్యంగా సుధీర్ బాబు కంటపడింది. ఆ వీడియోను చూసి హీరోగా కాదు... ఓ తండ్రిగా రగిలిపోయాడు. వీడియోలో కన్న కొడుకునే తీవ్రంగా కొడుతున్న ఆ తండ్రిని తానే చావగొడతానంటున్నాడు. 

బెంగళూరులో ఓ దుర్మార్గులు తన తొమ్మిదేళ్ల కొడుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. తొమ్మిదేళ్ల ఆ పిల్లాడు కొట్టద్దు నాన్నా అని వేడుకున్నా కూడా వినిపించుకోలేదు. సెల్ ఫోన్ వైర్ తో చర్మం తట్లు తేలేలా కొట్టాడు. అంతేకాదు రెండు చేతులతో పైకెత్తి కింద పడేశాడు. ఈ తతంగాన్ని ఆ పిల్లాడే తల్లే వీడియో తీసింది. అంతేకాదు భర్తకి కొడుకుపై కంప్లయింట్లు ఇస్తూ రెచ్చగొట్టింది. ఇది జరిగి ఆరునెలలు అయ్యాక ఫోను రిపేరుకు రావడంతో షాపుకు ఇచ్చింది ఆ మహాతల్లి. అందులో ఉన్న వీడియోను రిపేరు కుర్రాడు చూశాడు. ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు వాట్సాప్లో పెట్టి వైరల్ అయ్యేలా... ఆ దుర్మార్గ తల్లిదండ్రులు చేసిన పనిని అందరికీ తెలిసేలా చేశాడు. పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు. 

సుధీర్ బాబు కాస్త ఆలస్యంగా ఆ వీడియోను చూశాడు. చిన్న తప్పుడు చాలా దారుణంగా పిల్లాడిని హింసించడం అతడిని చాలా బాధపెట్టింది. ఆ దుర్మార్గపు తండ్రి ఎక్కడ ఉంటాడో చెప్పండి... వాడిని నేను ఇంతకన్నా దారుణంగా చావగొడతా. అసలు వాడిని తండ్రి అనాంటేనే సిగ్గుగా ఉంది అని వీడియోతో పాటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ ఈ మాటలు రాసింది హీరో సుధీర్ బాబు కాదు... ఇద్దరు పిల్లల తండ్రయిన సుధీర్. నిజమే తప్పు చేస్తే మంచి చెడ్డలు చెప్పాల్సింది పోయి... రాక్షసుల్లా చిట్టి ప్రాణాలకు నరకం చూపిస్తే వారిని తల్లిదండ్రులు కాదు... నరరూప రాక్షసులు అనాలి. 

 

https://