రోడ్డుపై వర్కౌట్స్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. అది కూడా కారుతో సామర్ధ్యాన్ని పెంచుకోవడం చాలా రేర్. అయితే టాలీవుడ్ లో ఎవరు ట్రై చేయని విధంగా హీరో సుధీర్ బాబు వందల టన్నుల్లో ఉన్న తన కారును తోస్తు వర్కౌట్ చేశాడు. రొటీన్ గా వారమంతా వర్కౌట్స్ చేయడం ఎందుకని తన ట్రైనర్ ఇలా ట్రై చేయమని చెప్పినట్లు సుదీర్ పేర్కొన్నాడు. 

ఆ విధంగా తన కారు బ్యాట్ రైడర్ ని సరదాగా పుష్ చేస్తూ బాడీకి ఫ్యూయల్ బూస్ట్ ని అందుకుంటున్నట్లు చెప్పాడు. అదే విధంగా ఇలా చేస్తే అప్పుడపుడు మన కారును ఇలా క్యారీ చేయవచ్చు అని సరదా క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం 'వి' సినిమా కోసం ఈ హీరో వర్కౌట్స్ చేస్తున్నాడు. సినిమాలో సరికొత్త ఫిట్ నెస్ తో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సుదీర్ బాబు కారును నెడుతున్న వీడియోను కింద ఇచ్చిన లింక్ లో చూడవచ్చు.