Asianet News TeluguAsianet News Telugu

ఈసారి ప్రభాస్ సాయం తీసుకున్న సుధీర్ బాబు.. ప్లాన్ గ్రాండ్ గానే ఉందిగా.. ఏంటంటే?

‘సలార్’ ట్రైలర్ రిలీజ్ కు ముందుకు ప్రభాస్ సాయం తీసుకుంటున్నారు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. తన నెక్ట్స్ సినిమా టీజర్ ను డార్లింగ్ లాంచ్ చేయనున్నట్టు తాజాగా అప్డేట్ అందించడం విశేషం. 

Sudheer Babu Harom Hara movie Teaser will be launched by Prabhas at this time NSK
Author
First Published Nov 26, 2023, 6:05 PM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) నెక్ట్స్ ఫిల్మ్ ‘హరోం హర’ (Harom Hara).  యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తాజా టీజర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూనే మరో ఆసక్తికరమైన న్యూస్ చెప్పుకొచ్చారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..‘హరోం హర’ చిత్ర టీజర్ ను  రేపు (నవంబర్ 27)న మధ్యాహ్నం 2:30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  లాంచ్  చేయనన్నారు.  ‘సలార్’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. టీజర్ ఎలా ఉండబోతోందనే చూడాలి. 

అయితే సుధీర్ బాబు వరుసగా డిజాస్టర్లనే అందుకుంటూ వస్తున్నారు. చివరిగా విడుదలైన ‘మామా మశ్చీంద్ర’ చిత్రం కూడా ఆశించిన ఫలితానివ్వలేదు. దీంతో నెక్ట్స్ రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు సుధీర్ బాబు. ఇందుకోసం సినిమా ప్రమోషన్స్ నే ఓ రేంజ్ లో ఉండేలా చేస్తున్నారు. ‘హరోం హర’ చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. 

తెలుగులో టీజర్ ను ప్రభాస్ విడుదల చేస్తుండగా.. తమిళంలో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడలో బాద్షా కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్మూట్టీ రిలీజ్ చేస్తుండటం విశేషం. టీజర్ కే ఈసారి సుధీర్ బాబు ఇంత ప్లాన్ చేశాడంటే.. సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి జ్నానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మన్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్  సంగీతం అందిస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

Follow Us:
Download App:
  • android
  • ios