బిగ్ బాస్ వేదికపై నాగార్జున స్థానంలో కిచ్చా సుధీప్ సందడి చేశారు. నాగార్జున స్థానంలో సుధీప్ ని చూసిన కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. అలాగే నాగ్ సర్ ఎక్కడని సుధీప్ ని ఆసక్తిగా అడిగారు. మీ వలన విసిగిపోయిన నాగ్ సర్, రావడం మానేశారు అన్నారు. కానీ ఇంటి సభ్యులు నాగ్ సర్ ని మేమంతో ప్రేమిస్తామని సమాధానం చెప్పారు. మీకంటే కూడా ఆయనను కుటుంబం ఎక్కువగా ప్రేమిస్తుందని, అందుకే ఆయన వెన్కక్కి వెళ్లిపోయాడని చెప్పి షాక్ ఇచ్చాడు. 

నాగార్జున మీకు ఎందుకు కావాలని కారణాలు చెప్పాలని సుధీప్ ఇంటి సభ్యులను కోరడం జరిగింది. ఐతే సుధీప్ తో పాటు బిగ్ బాస్ వేదికపైకి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. సుధీప్ ఇంటి సభ్యులతో సరదాగా ఆదుకున్నాడు. ఇంటిలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్ కి వెళ్ళడానికి ఇస్టపడతావ్ అని అడుగగా, అవినాష్ తేల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. అఖిల్, మోనాల్ ల మ్యాచింగ్ డ్రెస్ ల గురించి నాగ్ అండ్ సుధీప్ ప్రత్యేకంగా మాట్లాడారు. 

ఇక మోనాల్ రొమాంటిక్ గా మీరంటే ఇష్టం అని సుధీప్ చెప్పింది. బిగ్ బాస్ తాజా ప్రోమో అదరగొడుతుండగా, నేటి ఎపిసోడ్ ఆసక్తిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. కన్నడ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా సుధీప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నేడు బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నాడు. అవినాష్ ని ఎలిమినేట్ చేసి, ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.