Asianet News TeluguAsianet News Telugu

'ఆకాశం నీ హద్దురా' డైరెక్టర్ సుధా కొంగర బి గ్రేడ్ మూవీ తీశారా..అదీ కృష్ణ భగవాన్ తో.. 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న మహిళా దర్శకులలో సుధా కొంగర సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. సూర్య హీరోగా తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా చిత్రం సుధా కొంగరకి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 

Sudha Kongara first movie with krishna bhagavan goes viral dtr
Author
First Published Nov 16, 2023, 7:29 PM IST

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న మహిళా దర్శకులలో సుధా కొంగర సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. సూర్య హీరోగా తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా చిత్రం సుధా కొంగరకి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాదు ఆ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. దీనితో సుధా కొంగర ప్రతిభకి ప్రసంశలు దక్కాయి. 

ఆకాశం నీ హద్దురా చిత్రానికి ముందు కూడా సుధా కొంగర పలు చిత్రాలు చేసింది. కానీ అవన్నీ చిన్న సినిమాలు కావడంతో గుర్తింపు దక్కలేదు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో గురు చిత్రాన్ని కూడా ఆమె తెరకెక్కించారు. ఆ చిత్రంతో సుధా కొంగర ప్రతిభ తెలిసింది కానీ అవసరమైన రేంజ్ లో క్రేజ్ రాలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు సుధా కొంగర తాను కోరుకోని విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. 

ఆకాశం నీ హద్దురా చిత్రానికి ముందు సుధా కొంగర పలు చిత్రాలకు రచయితగా దర్శకురాలిగా చేశారు. అయితే ఆమె కెరీర్ ఆరంభంలో అంటే 2008లో ఓ బీగ్రేడ్ తరహా చిత్రాన్ని తెరకెక్కించినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా కమెడియన్ కృష్ణ భగవాన్ తో. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ వైరల్ చేస్తూ ఇది ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన మూవీ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. 

ఆ చిత్రం పేరు ఆంధ్ర అందగాడు.శృంగార భరితంగా ఉన్న ఈ చిత్ర పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. వికీపీడియాలో ఈ మూవీ డైరెక్టర్ పేరు సుధా కొంగర అనే చూపిస్తోంది. దీనితో అంతా షాక్ అవుతున్నారు. అదేంటి సుధా కొంగర బి గ్రేడ్ మూవీ తీసారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సుధా కొంగర ఎటూ స్పందించలేని పరిస్థితి. ఎలాంటి కామెంట్ చేసినా దీని గురించి చర్చ మరింత ఎక్కువ కావడం ఖాయం. 

అయితే ఈ విషయంలో సుధా కొంగరని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది దర్శకులకు కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న అవకాశాలే వస్తాయి. ప్రూవ్ చేసుకుంటే పెద్ద దర్శకులుగా మారుతారు. సుధా కొంగర అలా ప్రూవ్ చేసుకుని నేషనల్ అవార్డు గెలిచిన చిత్రాన్ని తెరకెక్కించారని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios